
horoscope today 08 April 2025 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం మంగళవారం రోజున చంద్రుడు సింహ రాశిలో సంచారం చేయనున్నాడు. ఈరోజు ద్వాదశ రాశులపై మాఘ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఇదే సమయంలో కామద ఏకాదశి వేళ అమల యోగం, సర్వార్ధ సిద్ధి యోగం కూడా ఏర్పడనున్నాయి. చంద్రుడు, కుజుడు 12వ స్థానంలో సంచారం చేయడం వల్ల అమల యోగం ఏర్పడనుంది. ఈ శుభ యోగాల ప్రభావంతో కొన్ని రాశుల వారికి విశేష ప్రయోజనాలు కలగనున్నాయి. మరికొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు రానున్నాయి. ఈ సందర్భంగా మేషం నుంచి మీన రాశుల వారికి ఏ మేరకు అదృష్టం రానుంది. 12 రాశుల వారు ఎలాంటి పరిహారాలు పాటించాలనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం…
ఆయనము: ఉత్తరాయనం, సంవత్సరం: శ్రీ విశ్వావసునామ
మాసం: చైత్ర, వారం : మంగళవారం, తిథి : శు. ఏకాదశి , నక్షత్రం : ఆశ్రేష
మేష రాశి
మేష రాశి వారి ప్రయత్నాలు అనుకూలతలు చూస్తారు. అనేక అంశాలలో పురోగతి ఉంటుంది. ఆర్థిక, ఆరోగ్యాలు పరవాలేనివిగా సాగుతాయి. అదనపు ఆదాయ ప్రయత్నాలు నెమ్మదిగా సాగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో మీదైన తరహాలో వ్యవహరించుకొంటారు. మీకు మీ మీ రంగంలో ప్రాధాన్యత పెరుగుతుంది. వివాహ, ఉద్యోగ ప్రయత్నాలు కలిసివస్తాయి. ఆధ్యాత్మికతకు ప్రాధాన్యత నిచ్చుకుంటారు.
వృషభ రాశి
వృషభ రాశి వారి లాభంలో గ్రహాధిక్యత పెరుగుటచే మీకు మంచి ప్రయోజనాలు ఏర్పడతాయి. గత ఇబ్బందులను దూరం చేసుకోగలరు. ఉన్నతాధికారులచే ప్రోత్సాహాలు పొందుతారు. అదనపు పనులను చేపట్టుకుంటారు. ఆరోగ్య, ఆర్థిక విషయాలు బాగుంటాయి. వివాహ ప్రయత్నాలు నెమ్మదిగా సాగుతాయి. ఇతరుల పట్ల ఆధిపత్య ప్రదర్శనలకు దూరంగా ఉండాలి.
మిథున రాశి
మిథున రాశి వారికి మంచి రోజులు. నిదానంగా సాగవలసివుంటుంది. నిర్ణయాల్లో ఓపికగా వ్యవహరించుకోండి. విజయాలు మీ వెంటే. ఆర్థికంగా ఉత్సాహాన్నిచ్చు సంఘటనలు ఉంటాయి. విషయాలను ఇంటా-బయటా కూడా సాగదీయకండి. కొన్ని గత ఇబ్బందులను దూరం చేసుకొంటారు. వాహన, యంత్ర ఉపయోగాల్లో జాగ్రత్తలు పాటించండి.
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి మధ్యమ ప్రయోజనాలు ఏర్పరచుకోగలరు. అవకాశాలను అంది పుచ్చుకోవాలి. శ్రమలు, ప్రయోజనాలు ఉంటాయి. అధికారులచే ఉద్యోగాల్లో ప్రయోజనాలు పొందుతారు. వ్యక్తిగత విమర్శలకు దూరంగా ఉండండి. అవసరాలను సమర్థించుకొను ఆదాయాలు ఉంటాయి. వ్యాపారాల్లో చెల్లింపులు పూర్తి చేసుకుంటారు. ఇతరులపట్ల మీ నిర్ణయాలలో మార్పులు చూడగలరు. సాహసాలకు, స్పెక్యులేషన్లకు దూరంగా ఉండండి. ఆరోగ్యం అనుకూలం.
సింహ రాశి
సింహ రాశి వారు గ్రహసంచారాలు మధ్యమోన్నతంగా ఉపకరిస్తాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఒత్తిడిని కలిగించు అంశాలన్నీ పురోగతి ఉంటుంది. అనుకొన్నవి పూర్తి చేస్తారు. ఆర్థిక లావాదేవీలలో సొంత ప్రణాళికలను అమలు చేయండి. దూర ప్రాంత ప్రయాణములు ఉంటాయి. మార్పు-చేర్పులకు సుదీర్ఘ ఆలోచనలు అవసరం. సంతానంలో ఒకరి నుండి శుభవార్తలు వింటారు.
కన్య రాశి
కన్య రాశి వారికి ప్రయోజనాలు ఏర్పరచే గ్రహసంచారాలు. ప్రయత్నాల్ని ముమ్మరం చేసుకొంటారు. అధికారిక హోదాలు సిద్ధిస్తాయి. ఆదాయాలు సామాన్యమైన అవసరాలను సమర్థించుకోగలరు. ప్రయాణ సౌకర్యాలు, నూతన గృహోపకరణాలు ఏర్పాట్లు ఉంటాయి. కుటుంబ వ్యక్తుల ఆరోగ్య విషయంలో చిన్నతరహా జాగ్రత్తలు తప్పనిసరి చేయండి. పోటీ పరీక్షలలో ఉత్తీర్ణతలు పొందుతారు.
తుల రాశి
తుల రాశి వారు గ్రహ సంచారాలు మిశ్రమ ప్రయోజనమిస్తాయి. కుటుంబంలో సహకారాలు పెరుగుతాయి. వ్యక్తిగత అంశాల్లో ఇతరుల ప్రమేయాలు పెరుగుతాయి. ఆరోగ్య విషయంలో సాధారణతలుంటాయి. ఆర్థికంగా సమర్థింపులు అవసరమౌతాయి. గత సమస్యలకు పరిష్కారాలు పొందుతారు. వ్యాపార, వ్యవహారాల్లో ఉత్సాహాన్నిచ్చు సంఘటనలుంటాయి. వృత్తి, ఉద్యోగాల్లో పని ఒత్తిడిని తగ్గించుకుంటారు.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారు కుటుంబ వ్యవహారాలలో ఒత్తిడిని పొందుతారు. వృత్తి, ఉద్యోగ, నాడు వ్యాపారాల్లో సాధారణతలు కొనసాగుతాయి. ఆరోగ్యపరమయిన జాగ్రత్తలకు ప్రాధాన్యతనిచ్చుకొంటూ సాగాలి. ప్రయత్న కార్యాల్లో ఆటంకాలు ఉన్నా పట్టుదలలు చూపి ప్రయత్న అనుకూలతలు పెంచుకుంటారు. విద్యార్థులు వ్యాసంగాలకై పట్టుదలలు చూపుకోవాలి. వ్యాపార వ్యవహారాల్లో క్రమంగా స్థిరపడతారు.
ధనుస్సు రాశి
ధనుస్సు రాశి వారు ఇంటా బయటా ఉత్సాహంగా వ్యవహరించుకుంటారు. సమస్యల నుండి, వివాదాల నుండి బయటపడతారు. ఆరోగ్యపరంగా చిన్నతరహా జాగ్రత్తలు తప్పనిసరి చేయండి. ఆదాయాలు పరవా లేనివిగా ఉంటాయి. ఉద్యోగ, పెండ్లి ప్రయత్నాల విషయంలో ఆశించినవి పొందుటకు వేచి వుండు విధానాలు పాటించుకోవాలి. ఉద్యోగాలలో బాధ్యతలు పెరుగుతాయి.
మకర రాశి
మకర రాశి వారి గ్రహసంచారాల్లో శన్యేతర గ్రహాలు, ప్రయోజనాలు ఇస్తాయి. శుభవార్తలు ఉంటాయి. ఉద్యోగాలలో పదోన్నతులకు, జీతాలు పెరుగుదలకు అవకాశాలు ఉన్నాయి. వృత్తి, వ్యాపారాల్లో పోటీని తట్టుకొని నిలబడతారు. ప్రయాణాలు సౌకర్యవంతంగా సాగుతాయి. నిరుద్యోగులకు మంచి అవకాశాలు ఏర్పడతాయి. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. గృహ, వాహన కొనుగోలుకు యత్నించుకొనువారికి మేలు తనములుంటాయి.
కుంభ రాశి
కుంభ రాశి వారి కార్యసాధనకు పట్టుదలలు జోడించాలి. కుటుంబ వ్యక్తుల నుండి సహకారాలు పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో అయిన వారి నుండి ప్రోత్సాహాలు ఏర్పరచుకోగలరు. మీ పనుల్ని సొంతంగా చేసుకోండి. ఆశించినవారి కలయికలు ఏర్పడతాయి. కాని ప్రయోజనాలు అంతంతమాత్రం. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఖర్చుల్ని నియంత్రించుకుంటారు.
మీన రాశి
మీన రాశి వారి ఆర్థిక అవసరాల పట్ల ముందు జాగ్రత్తలు తప్పనిసరి చేయండి. సహకారాలను ఇతరులను అడగకండి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి చేయండి. మీ అభిప్రాయాలను ఇంటా బయటా సున్నితంగా తెలియచేయండి. వృత్తి, ఉద్యోగాల్లో సమీపులలో గుర్తింపులు పొందుతారు. ఉపాధి పథకాలపట్ల ఆకర్షితులవుతారు. ఖర్చులకు నియంత్రణలు పాటించుకోవాలి.