
తెలుగు పంచాంగం ప్రకారం, శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో ఏప్రిల్(April) 11వ తేదీ
ఉత్తరాయణం
మాసం (నెల): చైత్ర మాసం
పక్షం: శుక్లపక్షం
వారం: శుక్రవారం
తిథి: చతుర్దశి తిథి మరుసటి రోజు తెల్లవారుజామున 3:21 గంటల వరకు ఉంటుంది. ఆ తర్వాత పౌర్ణమి తిథి ప్రారంభమవుతుంది
నక్షత్రం: ఉత్తర ఫాల్గుణి నక్షత్రం మధ్యాహ్నం 3:10 గంటల వరకు ఉంటుంది. ఆ తర్వాత హస్తా నక్షత్రం ప్రారంభమవుతుంది
యోగం: ధ్రువ రాత్రి 7.41 వరకు
కరణం: గరజి మధ్యాహ్నం 2.11 వరకు వనిజ తెల్లవారుజామున 3.23 వరకు
ఈరోజు చంద్రుడు సింహం నుంచి కన్య రాశిలో సంచారం చేయనున్నాడు.
నేడు శుభ ముహుర్తాలివే..
బ్రహ్మ ముహుర్తం : తెల్లవారుజామున 4:29 గంటల నుంచి ఉదయం 5:17 గంటల వరకు
అభిజిత్ ముహుర్తం : ఉదయం 11:52 గంటల నుంచి మధ్యాహ్నం 12:41 గంటల వరకు
సంధ్యా సమయం : సాయంత్రం 6:03 గంటల నుంచి సాయంత్రం 6:58 గంటల వరకు
అమృత కాలం : ఉదయం 7:07 గంటల నుంచి ఉదయం 8:54 గంటల వరకు
సూర్యోదయం సమయం 11 ఏప్రిల్ 2025 : ఉదయం 6:06 గంటలకు
సూర్యాస్తమయం సమయం 11 ఏప్రిల్ 2025: సాయంత్రం 6:27 గంటలకు
నేడు అశుభ ముహుర్తాలివే..
రాహు కాలం : ఉదయం 10:44 గంటల నుంచి మధ్యాహ్నం 12:17 గంటల వరకు
గులిక్ కాలం : ఉదయం 7:39 గంటల నుంచి ఉదయం 9:11 గంటల వరకు
యమగండం : మధ్యాహ్నం 3:22 గంటల నుంచి సాయంత్రం 4:54 గంటల వరకు
దుర్ముహుర్తం : ఉదయం 8:34 గంటల నుంచి ఉదయం 9:24 గంటల వరకు, మధ్యాహ్నం 12:41 గంటల నుంచి మధ్యాహ్నం 1:31 గంటల వరకు
నేటి పరిహారం : ఈరోజు లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు చేయాలి.
రాశిఫలాలు 11 ఏప్రిల్ 2025
horoscope today 11 April 2025 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం శుక్రవారం రోజున చంద్రుడు కన్య రాశిలో సంచారం చేయనున్నాడు. ఈరోజు ద్వాదశ రాశులపై ఉత్తర ఫాల్గుణి నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఇదే సమయంలో మీన రాశిలో శుక్రుడు, శని, రాహువు, బుధుడు, సూర్యుడు కలిసి పంచ గ్రహ యోగాన్ని ఏర్పరచనున్నారు. ఈ శుభ యోగం కారణంగా మేషం సహా కొన్ని రాశుల వారికి అద్భుతమైన ఫలితాలు రానున్నాయి. మరికొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు రానున్నాయి. ఈ సందర్భంగా మేషం నుంచి మీన రాశుల వారికి ఏ మేరకు అదృష్టం రానుంది తెలుసుకుందాం.
మేష రాశి
మేష రాశి వారికి శుక్రుడు మిశ్రమ ఫలితాలనిస్తాడు. నూతనపెట్టుబడులు, వ్యాపారాలకు అవకాశం ఉంది. సమస్యలను పరిష్కరించుటకు రాజీపడుట మంచిది. వాస్తవ దృష్టితో పరిశీలిస్తే సమస్యలకు పరిష్కారం వస్తుంది.
వృషభ రాశి
వృషభ రాశి వారికీ అప్పుల నుండి విముక్తి, ఆర్థికంగా స్థిరత్వం, మీరు అనుకున్నది అనుకున్నట్లు సాధిస్తారు. మీ కీర్తి పెరుగుతుంది. భూమి కొనుగోలు చేసే ప్రయత్నానికి శ్రీకారం చుడతారు. ఇల్లు కొనడానికి అవకాశాలు మెరుగవుతాయి.
మిధున రాశి
మిధున రాశి వారు ధనాన్ని అధికంగా ఖర్చు చేస్తారు. ఆర్థికంగా ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. ధ్యానయోగం ద్వారా ఉపశమనం పొందండి.
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికీ ఉద్యోగ, వృత్తి వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి. సమాజంలో మీ హోదా, గౌరవం పెరుగుతాయి. కుటుంబ విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి.
సింహ రాశి
సింహ రాశి శ్రద్ధ చేసి చదివి పరీక్షలలో విజయం సాధిస్తారు. స్వయం వృత్తుల వారికి అనేక రకాలుగా లాభాలు ప్రోత్సాహకాలు వస్తాయి. మీ స్నేహితులు, సలహాదారులు, పెద్దలు మీకు విలువ ఇచ్చి మంచిగా వ్యవహరిస్తారు.
కన్య రాశి
కన్య రాశి వారికి ప్రయాణంలో సమస్యలు, ఖర్చులు అధికమవుతాయి. మీరు మీ జీవితభాగస్వామికి మరియు పిల్లలకే సమయం కేటాయించండి. ఎదుటివారితో మాట్లాడేతీరు మెరుగుపరచుకోండి.
తుల రాశి
తుల రాశి వారికీ ఆదాయవనరులు పెరుగుతాయి. ఇతర దేశాలకు వెళ్ళే ప్రయత్నాలు కలసివస్తాయి. పిల్లల చదువుల విషయంలోనూ ఉత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. ఉద్యోగంలో పదోన్నతి వస్తుంది.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి తాత్కాలికంగా తక్కువ సమయంలో లాభాలు వచ్చే వ్యాపారాలు చేస్తారు. స్టాక్ మార్కెట్, షేర్ల వ్యాపారాలలో ఆచితూచి వ్యవహరిస్తూ ధనం వెచ్చించండి.
ధనుస్సు రాశి
ధనుస్సు రాశి వారికి విద్యా విషయాలలో శ్రద్ధ అవసరం. చదువుల్లో క్రమేపీ రాణిస్తారు. శోభాయ మానంగా, వాక్చాతుర్యంతో ఆధునిక సమాచారం, నవీన విషయ పరిజ్ఞానంతో అందరినీ ఆకట్టుకుంటారు.
మకర రాశి
మకర రాశి వారు గృహమున సంతానం విషయంలో శుభవార్తలు వింటారు. జీవనం ఆనందమయంగా ఉంటుంది. దూరప్రాంతాలకు వెళ్లవలసి వస్తుంది. విదేశీప్రయాణాలు కలసివస్తాయి. స్నేహితుల తోడ్పాటు మీకు ఉంటుంది.
కుంభ రాశి
కుంభ రాశి వారికి గృహోపకరణాలు, అలంకరణ వస్తువులు, రత్నాలు, ఆభరణాల కొనుగోలు కోసం మీ డబ్బును ఖర్చు చేసే అవకాశం ఉంది. సంగీతం పట్ల అభిరుచి ఆసక్తి పెంచుకుంటారు. విందువినోదాలలో పాల్గొంటారు.
మీన రాశి
మీన రాశి వారికి స్వీయనియంత్రణ విధించుకుని ఇతరులతో సత్సంబంధాలు మెరుగుపరచుకుంటారు. వివాహవిషయాలలో భావోద్వేగానికి గురికాకండి. ఈ రాశిలోని విద్యార్థులు ఫార్మసీ, వైద్యవిద్యకు సంబంధించిన చదువులలో ప్రావీణ్యత గడిస్తారు.