
Vrishabha Rasi Ugadi Rasi Phalalu 2025: వృషభ రాశి జాతకులకు విశ్వావసు నామ సంవత్సరం రాశి ఫలాలు ఎలా వున్నాయి?
విశ్వావసు నామ సంవత్సరం వృషభ రాశి ఫలితములు
వృషభం (కృత్తిక 2,3,4; రోహిణి: మృగశిర 1,2 పాదాలు)
గురు వృషభ రాశి సంచారంతో ధన నష్టం
గురు ఈ సంవత్సరం ఉగాది నుండి 14.5.25 వరకు వృషభంలో ఉంటాడు. వృత్తి, ఉద్యోగరంగాల్లో అభివృద్ధి ఆలస్యంగా వుంటుంది. ఆకస్మిక ధన నష్టం కలిగే అవకాశాలుంటాయి. ఏ విషయంలోను స్థిర నిర్ణయాలు తీసుకోలేకపోతారు. అనుకోని ఆపదల్లో చిక్కుకోకుండా గౌరవ, మర్యాదలకు భంగం వాటిల్లకుండా జాగ్రత్తపడుట మంచిది.
15.5.25 నుండి 19.10.25 వరకు, తిరిగి 6.12.25 నుండి సంవత్సరం చివరి వరకు మిథునంలో ఉంటాడు. ధర్మకార్యాలు చేయడానికి ఆసక్తి పెరుగుతుంది. దైవ దర్శనం చేసుకుంటారు. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. మానసిక ఆనందాన్ని అనుభవిస్తారు. పేరు ప్రతిష్ఠలు లభిస్తాయి. ఆకస్మిక ధన లాభం ఉంటుంది. శుభవార్తలు వింటారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు.
20.10.25 నుండి 5.12.25 వరకు కర్కాటకంలో ఉంటాడు. బంధు, మిత్రులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త పడడం మంచిది. ఆర్థిక ఇబ్బందుల నెదుర్కొంటారు. స్వల్ప అనారోగ్య బాధలుంటాయి. వృత్తి, ఉద్యోగరంగంలో అభివృద్ధి ఉంటుంది. మానసికాందోళనతో కాలం గడుస్తుంది. ప్రయత్నలోపం లేకుండా పనులు చేసుకోలేక పోతారు.
శని మీన రాశి సంచారంతో ఆకస్మిక ధన లాభం
శని ఈ సంవత్సరం ఉగాది నుండి సంవత్సరం చివరి వరకు మీనంలో ఉంటాడు. ప్రయత్నకార్యాలందు దిగ్విజయాన్ని పొందుతారు. ఆకస్మిక ధన లాభం ఉంటుంది. కుటుంబం అంతా సంతోషంగా కాలక్షేపం చేస్తారు. ఒక ముఖ్యమైన పని పూర్తి కావడంతో మిక్కిలి ఆనందిస్తారు. కీర్తి, ప్రతిష్ఠలు పొందుతారు. శాశ్వత పనులకు శ్రీకారం చుడతారు.
రాహువు మీన రాశి సంచారంతో శుభవార్తలు, శుభకార్య ప్రయత్నాలు
ఈ సంవత్సరం ఉగాది నుండి 18.5.25 వరకు మీనంలో ఉంటాడు. నూతన వస్తు, వస్త్ర, వాహన, ఆభరణ, లాభాలను పొందుతారు. ఆకస్మిక ధనలాభ యోగం ఉంటుంది. శుభవార్తలు వింటారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. బంధు, మిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ఒక ముఖ్యమైన కార్యక్రమం పూర్తి అవుతుంది.
19.5.25 నుండి సంవత్సరం చివరి వరకు కుంభంలో ఉంటాడు. మానసికానందం లభిస్తుంది. గతంలో వాయిదా వేయబడిన పనులు పూర్తవుతాయి. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. వృత్తి రీత్యా అభివృద్ధిని సాధిస్తారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా నుంటాయి. కొన్ని జటిలమైన సమస్యలకు పరిష్కారం లభిస్తుంది.
కేతువు కన్య రాశి సంచారంతో మనోల్లాసం
కేతువు ఈ సంవత్సరం ఉగాది నుండి 18.5.25 వరకు కన్యలో ఉంటాడు. పట్టుదలతో కొన్నికార్యాలు పూర్తి చేసుకోగలుగుతారు. పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండడం మంచిది. వృత్తిరీత్యా గౌరవ, మర్యాదలు పొందుతారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా వుంటాయి. మనోల్లాసాన్ని పొందుతారు. స్వల్ప అనారోగ్య బాధలుంటాయి.
19.5.25 నుండి సంవత్సరం చివరి వరకు సింహంలో ఉంటాడు. కుటుంబ విషయాలపై అనాసక్తితో ఉంటారు. గృహంలో మార్పులు జరిగే అవకాశాలున్నాయి. తలచిన కార్యాలు ఆలస్యంగా నెరవేరతాయి. కొన్నికార్యాలు విధిగా రేపటికి వాయిదా వేసుకుంటారు.
స్త్రీలతో జాగ్రత్తగా ఉండడం మంచిది. వృషభ రాశి వారు మరింత శుభఫలితాలు ఈ సంవత్సరం పొందాలి అనుకుంటే శుక్రవారం రోజు లక్ష్మీ దేవిని పూజించటం, కనకధార స్తోత్రాన్ని పఠించండి. శ్రీకృష్ణుని పూజించడం, ఆరాధించడం, శ్రీకృష్ణుని ఆలయ దర్శనం వలన మరింత శుభ ఫలితాలను పొందవచ్చు.
మాసవారి ఫలితములు
ఏప్రిల్ నెల
ఈ మాసం మీకు మధ్యస్థంగా ఉంటుంది. మీరు చేసే ప్రతి పనిలో కలసి వస్తుంది. విదేశీ ప్రయాణం కోసం మీరు చేసే ప్రయత్నములు ఫలించును. ఇరుగుపొరుగు వారితో వివాదము ఏర్పడే సూచనలున్నాయి. వృధా ప్రయాణాలుంటాయి. ప్రతి పనిని మీరు స్వయంగా చూసుకొనుట మంచిది. కీళ్ళ నొప్పులు, దెబ్బలు తగులుట వంటివి జరగవచ్చు.
మే నెల
ఈ మాసం మీకు అనుకూలంగా ఉన్నది. సంఘము నందు గౌరవ మర్యాదలుంటాయి. వ్యాపారపరంగా లాభాలు ఉంటాయి. మానసికానందం. వస్త్రములు, ఆభరణములు కొనుగోలు చేస్తారు. మృష్టాన్న భోజనం చేస్తారు. అప్పులు చేస్తారు.
జూన్ నెల
ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. అనారోగ్య సమస్యలుంటాయి. బంధువులతో విందు వినోదాలలో పాల్గొంటారు. పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మీరు చేసే పనులు కలసిరావు. స్త్రీలతో సంభాషణలుంటాయి.
జూలై నెల
ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. మీరు చేయు పనుల యందు జాగ్రత్త లేకపోవటం. ప్రయాణాలయందు ఆటంకాలు ఏర్పడతాయి. మీ మాటల వలన ఇతరులు బాధపడతారు. విపరీతంగా ఆలోచనలు చేస్తారు. ధనం కలసివచ్చును. ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నం ఫలించును.
ఆగస్టు నెల
ఈ మాసం మీకు మధ్యస్థంగా ఉన్నది. గృహమార్పులుంటాయి. చేసిన మేలు మరచిపోవుదురు. అధిక శ్రమతో పనులు పూర్తి చేస్తారు. నూతన వస్త్రలాభం ఉంటుంది. ఇరుగు పొరుగు వారితో మాట పట్టింపులుంటాయి. విందు, వినోదాల్లో పాల్గొంటారు. మంచి సౌఖ్యముండును.
సెప్టెంబర్ నెల
ఈ మాసం మీకు మధ్యస్థ ఫలితాలుంటాయి. కుటుంబముతో ఆనందముగా ఉంటారు. స్నేహితులను కలుస్తారు. శుభకార్యములు నిర్వహిస్తారు. ప్రయాణములలో స్వల్ప ఇబ్బందులుంటాయి. గృహ మార్పులుంటాయి. భోజన సౌఖ్యం. చెడు వార్తలు వింటారు.
అక్టోబర్ నెల
ఈ మాసం మీకు అనుకూలంగా ఉన్నది. శుభవార్త వింటారు. అకాల భోజనం. ధన సౌఖ్యముండును. మీ ప్రతిభకు గుర్తింపు ఉంటుంది. భార్యాభర్తలు కలసి ప్రయాణము చేస్తారు. కోపావేశమును తగ్గించుకోవడం మంచిది. కోర్టు లావాదేవీలు అంత అనుకూలంగా లేవు.
నవంబర్ నెల
ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. అనారోగ్య సమస్యలుంటాయి. దూర ప్రయాణములు చేస్తారు. ప్రభుత్వ పరంగా గుర్తింపు ఉండును. వ్యాపారస్తులకు సామాన్య ఫలితాలుంటాయి. ఆచితూచి సంభాషించాలి. పెద్దవారి అండదండలుంటాయి.
డిసెంబర్ నెల
ఈ మాసం మీకు అనుకూలంగా ఉన్నది. మీరు చేసే పనులు పూర్తి అవుతాయి. ధనము, గౌరవము పెరుగుతాయి. విందు భోజనములు చేస్తారు. శుభకార్యాలు చేస్తారు. నూతన వ్యక్తులతో పరిచయాలేర్పడతాయి. ఆభరణాలు కొంటారు.
జనవరి నెల
ఈ మాసంలో మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. ఇతరులతో ఆచితూచి సంభాషించాలి. ధన వ్యయముండును. వ్యసనములకు ఖర్చులు అధికమగును. మిత్రుల సహకారముంటుంది. దైవదర్శనము చేస్తారు. శుభకార్యాలకు ప్రయత్నాలు చేస్తారు.
ఫిబ్రవరి నెల
ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. స్థానచలనం ఉండొచ్చు. పిల్లలకు ఆరోగ్యపరంగా సమస్యలు రావచ్చు. ఒక శుభవార్త ఆనందాన్నిస్తుంది. తోటి వ్యాపారస్తులతో సమస్యలుంటాయి. చిన్న చిన్న ప్రమాదాలు జరుగుతాయి. ఇతరులతో వాగ్వివివాదాలకు దూరంగా ఉండాలి.
మార్చి నెల
ఈ మానం అనుకూలంగా లేదు. శుభకార్యములు చేస్తారు. ధనం లభించును. వ్యాపారపరంగా ధన నష్టము కలుగుతుంది. అనారోగ్య సూచనలున్నాయి. పెద్దవారితో కలహములు ఉండొచ్చు. అపరిచితులతో జాగ్రత్తగా ఉండాలి. మీరు చేసే పనులు పూర్తి అవుతాయి. కోపము అధికంగా వచ్చును.